MS Dhoni: బౌలర్ దేశ్‌పాండేకు క్లాస్ పీకిన ధోనీ.. వీడియో
MS Dhoni: నోబాల్స్, వైడ్స్ వేస్తున్న బౌలర్లపై ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాగే వేస్తే తాను కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు హెచ్చరించాడు. లక్నోతో మ్యాచ్‌లో అతికష్టంగా నెగ్గిన తర్వాత ధోనీ ఈ వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ముగిశాక దేశ్‌పాండేకు బౌలింగ్ టిప్స్ కూడా ఇచ్చాడు.
చెన్నై: ఐపీఎల్(IPL)లో భాగంగా సోమవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు 12 రన్స్ తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో చెన్నై భారీ మొత్తంలో ఎక్స్ట్రా రన్స్ సమర్పించుకున్నది. దాదాపు 18 పరుగుల్ని ఎక్స్‌ట్రాల రూపంలో ఇచ్చేసుకున్నది. ఆ జట్టు పేస్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే(Tushar Deshpande) మరీ అద్వాన్నంగా బౌలింగ్ చేశాడు. నోబాల్స్, వైడ్స్ అతను ఎక్కువగా వేశాడు. ఆ మ్యాచ్‌లో తుషార్ దేశ్‌పాండే మూడు నోబాల్స్, నాలుగు వైడ్లు వేశాడు. దీనిపై కెప్టెన్ ధోనీ(Dhoni) చాలా సీరియస్ అయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతను కాస్త కోపంగానే మాట్లాడారు. ఒకవేళ బౌలర్లు మెరుగవ్వకుంటే.. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని హెచ్చరించాడు. మా బౌలర్లు ఎక్స్ట్రా బంతులు ఎక్కువగా వేస్తున్నారని, ఒకవేళ వాళ్ల మారకుంటే మరో కెప్టెన్ కింద ఆడాల్సి వస్తుందన్నాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత బౌలర్ దేశ్‌పాండేకు ధోనీ బౌలింగ్(bowling) క్లాస్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మ్యాచ్ గెలిచి ప్లేయర్లు హ్యాండ్‌షేక్స్ ఇచ్చుకుంటున్న సమయంలో.. క్రీజ్ వద్ద దేశ్‌పాండేకు ధోనీ బౌలింగ్ లెక్చర్ ఇచ్చాడు. దేశ్‌పాండేకు బౌలింగ్ లైన్ వద్ద స్టెప్పులు వేస్తూ మరీ బౌలింగ్ ఎలా వేయాలో నేర్పాడు. ఆ వీడియో ఇదే.
MSD had a conversation with Tushar about noball, he even showed how not to bowl him. Tushar will come good for us, trust THALA 🛐. pic.twitter.com/6mH50ZIPz0
— 𝑻𝑯𝑨𝑳𝑨 (@Vidyadhar_R) April 3, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

