India | థామస్, ఊబర్ కప్.. క్వార్టర్స్‌లోనే ముగిసిన భారత్ పోరు
ప్రతిష్టాత్మక థామస్, ఊబర్ కప్ ఫైనల్స్లోభారత్ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. థామస్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ క్వార్టర్స్‌లో 1-3 తేడాతో చైనా చేతిలో పోరాడి ఓడింది. 2022లో ఇండోనేషియాను ఓడించిన భారత్..
- డిఫెండింగ్ చాంపియన్స్‌కు చెక్ పెట్టిన చైనా
- జపాన్ చేతిలో చిత్తైన అమ్మాయిలు
India | చెంగ్డూ: ప్రతిష్టాత్మక థామస్, ఊబర్ కప్ ఫైనల్స్లోభారత్ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. థామస్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ క్వార్టర్స్‌లో 1-3 తేడాతో చైనా చేతిలో పోరాడి ఓడింది. 2022లో ఇండోనేషియాను ఓడించిన భారత్.. పటిష్టమైన చైనాతో పోరులో మాత్రం తడబడింది. మరోవైపు సీనియర్ల గైర్హాజరీలో ఊబర్ కప్ ఆడిన అమ్మాయిలు.. 0-3 తేడాతో జపాన్ చేతిలో ఓడారు. థామస్ కప్ క్వార్టర్స్ పోరులో భాగంగా హెచ్ఎస్ ప్రణయ్.. 21-15, 11-21, 14-21 తేడాతో షి యు కి చేతిలో ఓడిపోవడంతో చైనాకు ఆరంభంలోనే ఆధిక్యం దక్కింది.
ఆ తర్వత డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్.. 15-21, 21-11, 12-21తో లియాంగ్ వె కెంగ్-వాంగ్ చెంగ్‌ల చేతిలో చిత్తయ్యారు. కానీ లక్ష్యసేన్ మాత్రం 13-21, 21-8, 21-14తో లి షి ఫెంగ్‌ను ఓడించి భారత శిబిరంలో ఆశలు రేపాడు. అయితే మరో డబుల్స్ ద్వయం ధ్రువ్-ప్రతీక్ 10-21, 10-21 తేడాతో హె జి థెంగ్ – రెన్ జియాంగ్ యు చేతిలో ఓడటంతో భారత పోరాటం ముగిసింది. అంతకుముందు ఊబర్ కప్‌లో భారత్‌కు జపాన్ చెక్ పెట్టింది. తొలి సింగిల్స్‌లో అష్మిత.. 10-21, 22-20, 15-21 తేడాతో అయ ఒహొరి చేతిలో పోరాడి ఓడింది. ప్రియ-శృతి ద్వయం 8-21, 9-21 పోరాటం లేకుండానే చేతులెత్తేశారు. ఇష్రాణి 15-21, 12-21 తేడాతో మాజీ వరల్డ్ నెంబర్ వన్ ఒకుహర చేతిలో చిత్తైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

