World Cup Final : డీవై పాటిల్ స్టేడియంలో దంచేస్తున్న ఓపెనర్ షఫాలీ వర్మ( 53 నాటౌట్) అర్ధ శతకం బాదేసింది. పవర్ ప్లేలో బౌండరీలతో విరుచుకుపడిన తను సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అయితే.. అంతుకుముందు ఓవర్లోనే స్మృతి మంధాన(45) ఔటయ్యింది. చ్లో ట్రయాన్ ఓవర్లో కట్ షాట్ ఆడాలనుకున్న తను.. వికెట్ కీపర్ జఫ్తా చేతికి చిక్కింది. దాంతో..తొలి వికెట్ సెంచరీ భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం సెమీ ఫైనల్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్ (3 నాటౌట్)తో షఫాలీ ఇన్నింగ్స్ నిర్మించే పనిలో ఉంది. 19 ఓవర్లకు స్కోర్.. 111-1.
వర్షం అంతరాయంతో ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్లో భారత జట్టుకు శుభారంభం లభించింది. దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికేస్తూ బౌండరీలతో రెచ్చిపోయారు షఫాలీ వర్మ(53 నాటౌట్), స్మృతి మంధాన(45నాటౌట్). సఫారీ ప్రధాన పేసర్ మరిజానే కాప్ తొలి ఓవర్లో ఒక్క పరుగు రాకున్నా.. రెండో ఓవర్లోనే ఖాకాకు షఫాలీ బౌండరీతో స్వాగతం పలికింది. ఇక నాలుగో ఓవర్లో కాప్ను బెంబేలెత్తిస్తూ వరుసగా రెండు ఫోర్లు కొట్టింది లేడీ సెహ్వాగ్.
Packing a punch 👊
An excellent FIFTY from Shafali Verma 👌
1⃣0⃣0⃣ up for #TeamIndia
Updates ▶ https://t.co/TIbbeE5t8m#WomenInBlue | #CWC25 | #INDvSA | #Final | @TheShafaliVerma pic.twitter.com/F0NUgDOknn
— BCCI Women (@BCCIWomen) November 2, 2025
ఖాక వేసిన ఆరో ఓవర్లో మంధాన రెండు వరుస బౌండరీలతో స్కోర్ 40 దాటించింది. 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మిధాలీ రాజ్(Mithali Raj) రికార్డును బ్రేక్ చేసింది మంధాన. 2017 వరల్డ్ కప్లో 409 పరుగులతో మాజీ కెప్టెన్ నెలకొల్పిన రికార్డును దాటేసింది.