అడిలైడ్: ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి వెళ్లింది. డే అండ్ నైట్ అడిలైడ్ టెస్టు(AUSvIND)లో రెండో రోజు తొలి సెషన్ ముగిసే వరకు ఆస్ట్రేలియా 4 వికెట్లకు 191 రన్స్ చేసింది. దీంతో ఆసీస్‌కు 11 పరుగుల ఆధిక్యం లభించింది. హెడ్ 53, మార్ష్ 2 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. డిన్నర్ బ్రేక్ తర్వాత మ్యాచ్ ఆసక్తికరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఉదయం బుమ్రా రెండు వికెట్లు తీసుకున్నాడు. నితీశ్ రెడ్డికి ఓ వికెట్ దక్కింది. తొలి సెషన్లో ఇండియా మొత్తం మూడు వికెట్లు తీసింది.
That’s the end of the 1st session on Day 2.#TeamIndia pick 3 wickets ; Australia lead by 11 runs.
Scorecard – https://t.co/urQ2ZNmHlO… #AUSvIND pic.twitter.com/DRAa0DxMiG
— BCCI (@BCCI) December 7, 2024
ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడుతున్నాడు. 67 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 53 రన్స్ చేశాడు. ట్రావిస్ హెడ్ వికటే ఇప్పుడు కీలకంగా మారింది. అయితే ఇవాళ ఉదయం లబుషేన్ క్రీజ్‌లో చాలా సేపు నిలదొక్కుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌ను అతను చాకచక్యంగా ఎదుర్కొన్నాడు. హాఫ్ సెంచరీ చేసిన లబుషేన్ 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. మెక్‌స్వీనే, లబుషేన్ మధ్య రెండో వికెట్‌కు 67 రన్స్ జోడించారు.