సిరికొండ, నవంబర్ 7: యువ పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ కుటుంబంలో విషాదం నెలకొన్నది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో సతమతమవుతున్న పూర్ణ తండ్రి దేవిదాస్(50) శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
కామారెడ్డిలోని ఒక ప్రైవేట్ దవాఖానలో కోమాలో ఉన్న ఆయన కన్నుమూశారు. అంత్యక్రియలు ఆయన స్వస్థలమైన సిరికొండ మండలం పాకాలలో రాత్రి జరిగాయి.