న్యూయార్క్: టీ20 వరల్డ్‌కప్(T20 World Cup)లో పాకిస్థాన్ జట్టు అమెరికా చేతిలో ఓడిన విషయం తెలిసిందే. అయితే ఆ ఓటమి గురించి ఆ దేశ ప్రభుత్వ అధికారి మాథ్యూ మిల్లర్‌ను మీడియా సమావేశంలో ఓ జర్నలిస్టు ప్రశ్న వేశారు. కొత్తగా క్రికెట్ ఆడుతున్న అమెరికా జట్టు మాజీ చాంపియన్లను ఓడించింది, దీనిపై మీ కామెంట్ ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు అధికారి స్పందిస్తూ.. బహుశా క్రికెట్ ఆటలో పాకిస్థాన్‌కు అనుభం లేదేమో అని ఆయన అన్నారు. నాకు అనుభవం లేని విషయాల్లో కామెంట్ చేయడం కష్టంగా మారుతుందని, బహుశా పాకిస్థాన్ జట్టు కూడా ఆ దశలో ఉందేమో అని ఆయన పేర్కొన్నారు.
టీ20 వరల్డ్‌కప్‌లో గత వారం అమెరికా జట్టు పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చింది. సూపర్ ఓవర్లో ఆ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. నేత్రావల్కర్ ఉత్తమ బౌలింగ్ ప్రదర్శనతో అమెరికాను ఆదుకున్నారు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 159 రన్స్ చేసింది. అయితే మ్యాచ్ టై కావడంతో.. సూపర్ ఓవర్‌కు వెళ్లింది. తొలుత సూపర్ ఓవర్లో అమెరికా 18 రన్స్ చేయగా, పాకిస్థాన్ కేవలం 13 రన్స్ చేసి ఓడిపోయింది.
అమెరికా చేతిలో పాక్ ఓడడంతో.. ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. స్వంత దేశంలో క్రీడాభిమానులు దుమ్మెత్తిపోశారు. ఇక ఆన్లైన్లో అయితే మీమ్స్‌తో చెలరేగిపోయారు. బాబర్ బృందాన్ని తమ కామెంట్లతో ఆటాడుకున్నారు. ప్రస్తుతం గ్రూప్ ఏలో ఇండియా, అమెరికా జట్లు టాప్‌లో ఉన్నాయి. సూపర్8పై దృష్టి పెట్టాయి. పాక్ తన చివరి మ్యాచ్‌లో ఆదివారం ఐర్లాండ్‌తో తలపడనున్నది.
#WATCH | On being asked about the USA beating Pakistan in the T20 Cricket World Cup, US Department of State Spokesperson Matthew Miller says “I often get in trouble when I try to comment on things beyond my area of expertise, and I would say Pakistan’s cricket team is certainly… pic.twitter.com/xHxQ0AxuBE
— ANI (@ANI) June 14, 2024