గురువారం 16 జూలై 2020
Sports - Apr 26, 2020 , 00:04:52

‘ఇప్పుడు మాట్లాడడం తొందరపాటే’

‘ఇప్పుడు మాట్లాడడం తొందరపాటే’

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో టీమ్‌ఇండియా ఆడాల్సిన టెస్టు సిరీస్‌ గురించి ఇప్పుడే మాట్లాడడం తొందరపాటు అవుతుందని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. అప్పటికి పరిస్థితులు, ఆంక్షలు ఎలా ఉంటాయో కూడా ప్రస్తుతం అంచనా వేయలేని స్థితి ఉందని శనివారం తెలిపారు. కరోనా వైరస్‌ కారణంగా దేశ సరిహద్దులను సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు మూసివేస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకో వడంతో  టీ20 ప్రపంచకప్‌ సహా ఆస్ట్రేలియాలో భారత పర్యటన కూడా సందిగ్ధంలో పడింది.  అయితే, ఆంక్షలు మరింత కాలం కొనసాగినా భారత జట్టుకు మినహాయింపు ఇవ్వాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా అక్కడి ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం.


logo