కొలంబో: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ కీలక పోరు సిద్ధమైంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమ్ఇండియా తలపడనుంది. తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తుచేసిన భారత్ మెండైన ఆత్మవిశ్వాసంతో ఉంటే..బంగ్లాదేశ్ చేతిలో అనూహ్య ఓటమితో పాక్ ఒత్తిడిలో ఉంది. దీనికి తోడు వన్డేల్లో దాయాది పాక్‌పై భారత్ తమదైన ఆధిపత్యం కొనసాగిస్తున్నది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 11 మ్యాచ్‌లు జరిగితే అన్నింటా టీమ్ఇండియాదే విజయం కావడం విశేషం. ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశముంది.
ఇటీవలే ఆసియాకప్‌లో పాక్‌ను మూడుసార్లు ఓడించిన పురుషుల జట్టు స్ఫూర్తిగా చెలరేగాలని అమ్మాయిలు పట్టుదలతో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పాక్ కంటే మెరుగ్గా కనిపిస్తున్న టీమ్ఇండియా మెరుగైన రన్‌రేట్‌తో మ్యాచ్ గెలువాలని చూస్తున్నది. గాయం నుంచి కోలుకున్న స్టార్ పేసర్ రేణుకాసింగ్ జట్టులోకి రావడం దాదాపు ఖాయం కాగా, వైస్ కెప్టెన్ స్మృతి మందన సూపర్ ఫామ్‌లో ఉండటం మనకు కలిసిరానుంది. బ్యాటింగ్‌లో ప్రతీకారావల్, హర్లిన్ , దీప్తిశర్మ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ స్థాయికి తగ్గట్లు రాణిస్తే పాక్‌పై గెలుపు మనకు నల్లేరుపై నడకే కావచ్చు.