ముంబై: ఆదాయ పన్ను నుంచి మినహాయింపు కోరేందుకు క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar).. తాను నటుడినని చెప్పుకున్నట్లు తెలిసింది. యాక్టర్ అని చెప్పుకున్న సచిన్‌కు ఆదాయపన్ను శాఖ సుమారు 58 లక్షల పన్ను మినహాయింపు కూడా కల్పించింది. ట్యాక్స్‌బడ్డీ సుజిత్ బంగర్ దీనికి సంబంధించిన విషయాన్ని తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 2002-03 సీజన్లో ఈ ఘటన జరిగినట్లు ఆయన చెప్పారు. ఆ ఏడాది విదేశీ కమర్షియల్స్‌లో నటించిన సచిన్ టెండూల్కర్‌కు సుమారు 5.29 కోట్ల ఆదాయం వచ్చింది. ఈఎస్పీఎన్, పెప్సీ, వీసా లాంటి యాడ్స్‌కు సచిన్ నటించాడు. కానీ ఆ ఆదాయాన్ని అతను క్రికెట్ ఇన్కంగా చూపించుకోలేదు. నటులు, రచయితలు, ఆర్టిస్టులు వాడుకునే సెక్షన్ 80ఆర్ఆర్ ట్యాక్స్ బెనిఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 30 శాతం అంటే సుమారు 1.77 కోట్లకు పన్ను మినహాయింపు ఇవ్వాలని సచిన్ అభ్యర్థించాడు.
వాస్తవానికి ఆదాయపన్ను శాఖ అధికారులు ఆ మినహాయింపు ఇచ్చేందుకు తొలుత అంగీకరించలేదు. క్రికెటర్లకు సహజంగానే యాడ్స్‌లో నటించే అవకాశం వస్తుందని, దీన్ని మరో ఆదాయంగా పరిగణించలేమని, 80ఆర్ఆర్ రూల్ వర్తించదు అని ఆదాయపన్ను శాఖ చెప్పింది. కానీ సచిన్ మాత్రం తన పంథా మార్చుకోలేదు. యాడ్స్ కోసం మోడలింగ్ చేశానని, ఇది యాక్టర్ల వృత్తి అని, దీనికి 80ఆర్ఆర్ నిబంధన వర్తిస్తుందని సచిన్ వాదించాడు. చివరకు సచిన్ వివరణతో సంతృప్తి చెందిన ఆదాయపన్ను శాఖ అధికారులు పన్ను మినహాయింపు కల్పించారు. కంపెనీ యాడ్లకు నటించడాన్ని యాక్టింగ్‌గా పరిగణించారు. దీంతో సచిన్‌కు 58 లక్షల పన్ను మినహాయింపు వచ్చింది.
Sachin Tendulkar wasn’t a “cricketer.”
He claimed he was an actor—to save ₹ 58 lakhs in taxes
Tax officer slapped a demand and penalty on him.
But here’s how Master blaster proved himself as an “Actor” and not a cricketer and won the case 🧵👇 pic.twitter.com/yaKhUfpmmd
— Sujit Bangar (@sujit_bangar) October 26, 2025