నాంటెస్(ఫ్రాన్స్) : నాంటెస్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళల జోడి అశ్విని పొన్నప్ప-తనీష కాస్ట్రొ మహిళల డబుల్స్ టైటిల్‌ను దక్కించుకున్నారు. ఫైనల్లో 21-15, 21-14 స్కోరుతో చైనీస్ తైపీకి చెందిన హంగ్ ఎన్జు-లిన్ యు పీని ఓడించి చాంపియన్లుగా నిలిచారు.
తొలి గేమ్‌లో 0-4తో వెనుకంజలో ఉన్న భారత జోడి తరువాత పుంజుకుని స్కోరును 10-10గా సమంచేసి, ఆపై జోరును పెంచి గేమ్‌ను గెలుచుకున్నారు.