బెంగుళూరు: ఇండియన్ మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్.. హిట్టింగ్ స్పెషలిస్ట్. అతను చాలా వేగంగా స్కోర్ బోర్డును పరుగెత్తించేవాడు. ఓపెనింగ్ బ్యాటర్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. టెస్టుల్లో అతను 91 సిక్సర్లు బాదాడు. అయితే ఆ రికార్డును ఇవాళ కివీస్ బ్యాటర్ టిమ్ సౌథీ(Tim Southee) దాటేశాడు. బెంగుళూరులో జరుగుతున్న టెస్టులో సౌథీ సిక్సర్లతో చెలరేగిపోయాడు.
బ్యాటింగ్‌లో లోయర్ ఆర్డర్లో వచ్చే సౌథీ.. 92 సిక్సులు కొట్టి సెహ్వాగ్ మైలురాయిని దాటేశాడు. టెస్టు మ్యాచుల్లో విరాట్, రోహిత్ శర్మలు కూడా అన్ని సిక్సులు బాదలేదు. టెస్టుల్లో అత్యధిక సిక్సులు కొట్టిన క్రికెటర్లలో టిమ్ సౌథీ ఏడవ ప్లేయర్. బెన్ స్టోక్స్ 131, మెకల్లమ్ 107, గిల్‌క్రిస్ట్ 100, గేల్ 98, జాక్వస్ కలిస్ 97 సిక్సర్లు బాదారు. మరో వైపు బెంగుళూరు టెస్టులో సౌథీ హాఫ్ సెంచరీ మార్క్ దాటేశాడు.