Tilak Varma | హైదరాబాద్, ఆట ప్రతినిధి: స్టార్ బ్యాటర్ ఠాకూర్ తిలక్‌వర్మ..హైదరాబాద్‌ను వీడి గోవాకు ఆడబోతున్నాడా? వర్మ హైదరాబాద్‌ను వీడుతున్నట్లు గురువారం సోషల్‌మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే దీనిపై వెంటనే స్పందించిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)..వర్మతో మాట్లాడిన తర్వాత స్పష్టతనిచ్చింది.
అతను జట్టును వీడటం లేదని హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించబోతున్నట్లు హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి వార్తలకు ప్రచారం కల్పించవద్దని, హైదరాబాద్‌తో కలిసి కొనసాగేందుకు వర్మ సిద్ధంగా ఉన్నాడని ఆయన స్పష్టం చేశాడు. కాగా మరోవైపు ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్‌యాదవ్..రాబోయే దేశవాళీ సీజన్లో గోవాకు ఆడబోతున్నట్లు వచ్చిన వార్తను ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎమ్సీఏ) తోసిపుచ్చింది.