హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐపీఎల్ ముగియడంతో పరిమిత ఓవర్లలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించే యువ క్రికెటర్లు ఇంగ్లండ్‌లో జరిగే కౌంటీల బాట పట్టారు. ఇప్పటికే రుతురాజ్ గైక్వాడ్.. యార్క్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకోగా, తాజాగా టీమ్ఇండియా టీ20 జట్టులో కీలక బ్యాటర్‌గా ఉన్న తిలక్ వర్మ సైతం కౌంటీల్లో ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశాడు.
ఈ మేరకు హాంప్‌షైర్ జట్టు అతడిని సంప్రదించగా అందుకు ఈ హైదరాబాదీ బ్యాటర్ అంగీకరించినట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. 22 ఏండ్ల తిలక్.. కౌంటీ చాంపియన్‌షిప్ లీగ్‌లో విజయవంతం కావాలని హెచ్‌సీఏ వెల్లడించింది.