Tilak Varma : మైదానంలో అతడొక పరుగుల యంత్రం. క్రీజులోకి వచ్చాడంటే మెరుపు షాట్లతో ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాడు. ఐపీఎల్లో ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ కుర్రాడు.. టీమిండియా మ్యాచ్ విన్నర్‌గా అవతరించాడు. ఇటీవలే ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై ప్రధాన ఆటగాళ్లు విఫలమైనా.. జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు తిలక్ వర్మ (Tilak Varma). ఉత్కంఠ రేపిన ఫైనల్లో చిరస్మరణీయ ఆటతో అభిమానుల గుండెల్లో నిలిచిన తిలక్.. మూడేళ్ల క్రితం ప్రాణాంతకమైన జబ్బుతో బాధ పడ్డాడు. ఇప్పటివరకూ రహస్యంగానే ఉన్న ఈ విషయాన్ని ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’ (Breakfast With Champions) అనే షోలో వెల్లడించాడీ చిచ్చరపిడుగు. ఇంతకూ ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడో తెలుసుకుందాం..
పొట్టి క్రికెట్లో దూకుడే కాదు పరిస్థితులకు తగ్గట్టు ఆడడం ఎంతో ముఖ్యం. అవసరాన్ని బట్టి గేర్ మార్చి.. మ్యాచ్ విన్నర్‌గా నిలిచే ఆటగాళ్లు కొందరే. అలాంటి వాళ్లలో తిలక్ వర్మ ఒకడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో పరుగలు వరద పారించిన ఈ యువకెరటం.. టీమిండియా తరఫున హ్యాట్రిక్ టీ20 శతకాలతో చరిత్ర సృష్టించాడు. ఆటే కాదు ఫిట్‌నెస్‌లోనూ తిరుగులేని తిలక్.. గడ్డు రోజుల్ని ఎదుర్కొన్నాడు. 2022లో భారత ఏ జట్టుతో పాటు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాడీ యంగ్ క్రికెటర్.
Tilak Varma in T20Is so far 👇
21 innings
707 runs
58.91 AVERAGE 🔥
156.07 STRIKE RATE 🔥 pic.twitter.com/9TDVXI9RIk— ESPNcricinfo (@ESPNcricinfo) January 26, 2025
తొలి అనధికారిక టెస్టులో విధ్వంసంక బ్యాటింగ్ చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 33 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. .. అయితే.. ఆ తర్వాత ఒక్కసారిగా అనారోగ్యంతో ఇబ్బంది పడ్డాడు. అప్పటిదాకా దంచేసిన అతడు 101ఆ సమయంలో ముంబై ఇండియన్స్ సహ యజమాని ఆకాశ్ అంబానీ.. బీసీసీఐ ఎంతో సహకరించారు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. వారి సాయాన్ని నేను మరువలేను అంటున్నాడీ ఆసియా కప్ హీరో.
‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’ అనే టీవీ షోలో హోస్ట్ గౌరవ్ కపూర్ (Gaurav Kapur)తో మాట్లాడుతూ సంచలన విషయాలు పంచుకున్నాడు తిలక్. ‘నా మొదటి ఐపీఎల్ తర్వాత ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. అయితే.. నేను ఫిట్‌గా ఉండేందుకు ప్రాధాన్యం ఇవ్చేవాడిని. కానీ, నా వల్ల కాలేదు. ఆ సమయంలోనే.. ‘రాబ్డోమయోలిసిస్’ (Rhabdomyolysis) అనే ప్రాణాంతకమైన వ్యాధి ఉన్నట్టు నిర్ధారించారు వైద్యులు. ఈ జబ్బు సోకిందంటే ఒంట్లోని కండరాలు విరిగిపోతాయి. టెస్టు జట్టులో చోటే లక్ష్యంగా పెట్టుకున్న నేను దేశవాళీలో ఆడుతూ.. ఏ సిరీస్‌లో రాణిస్తున్న రోజులవి. ఐస్ బాత్ మాత్రమే చేసేవాడిని. అయితే.. నా శరీరానికి కోలుకునేందుకు తగినంత సమయం ఇవ్వలేదు. విశ్రాంతి తీసుకోవాల్సిన రోజుల్లోనూ జిమ్‌కు వెళ్లేవాడిని. ఫలితంగా కండరాల మీద ఒత్తిడి పెరిగి.. ముక్కలవ్వసాగాయి. ఫలితంగా.. నరాలు చాలా గట్టిగా మారేవి. అప్పుడు నేను బంగ్లాదేశ్‌లో ఏ జట్టుతో అనధికారిక టెస్టు ఆడుతున్నా. కండరాల నొప్పిని భరిస్తూనే సెంచరీ కొట్టాను. కానీ, శతకం తర్వాత నా కళ్లు మసకగా మారాయి.
Tilak Varma Revealed After His First IPL in 2022 How He was Diagnosed With Rhabdomyolysis. How Akash Ambani & BCCI Helped Him. Few Hour Here n There Ded Stage! Later on He Cameback in IPL Played One Of The Magnificent Knock Against RCB in IPL 2023. An Insane Story Man 🫡 #Cricket pic.twitter.com/Nuk55C3uPN
— its Shruti (@Shruti_v31) October 23, 2025
నా చేతి వేళ్లు ఎటూ కదల్చడానికి వీల్లేకుండా బిగుసుకుపోయాయి. అప్పుడు నేనొక బండరాయిలా మారినట్టు అనిపించింది. దాంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాను.. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాక చేతుల నుంచి గ్లోవ్స్ రాకపోవడంతో కత్తిరించారు. నా పరిస్థితి తెలియగానే ముంబై ఇండియన్స్ నుంచి ఆకాశ్ ఫోన్ చేసి ఆరా తీశాడు. అప్పటి బీసీసీఐ కార్యదర్శి జై షా(Jai Shah)తో ఆయనే మాట్లాడి వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. నన్ను పరీక్షించిన వైద్యలు ముందే అస్పత్రికి రావాల్సిందని.. ఇంకొంచెం ఆలస్యం చేసి ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉండేవని, ప్రాణాపాయం ఉండేదని అన్నారు. నరాల ద్వారా ఇంజక్షన్ ఇవ్వాలని చూశారు. కానీ. చేతులు గట్టిగా మారడంతో సూదులు విరిగిపోయేవి. ఆ సమయంలో నన్ను అమ్మ ఎంతో బాధ పడింది. కానీ.. వైద్యుల కృషి ఫలితంగా.. నా ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. కొన్ని నెలలు విశ్రాంతి తీసుకున్నాక ఎన్సీఏలో ఫిట్నెస్ సాధించాను’ అని తిలక్ తన జీవితంలోని క్లిష్టమైన రోజులను ఎదుర్కొన్న తీరును వివరించాడు.
𝙄𝙣𝙣𝙞𝙣𝙜𝙨 𝘽𝙧𝙚𝙖𝙠!
A power-packed unbeaten TON from Tilak Varma 💪
A quickfire half-century from Abhishek Sharma ⚡️#TeamIndia post 219/6 on the board 👏Over to our bowlers now 👍
Scorecard ▶️ https://t.co/JBwOUCgZx8 #SAvIND | @TilakV9 | @IamAbhiSharma4 pic.twitter.com/iUNnLLs9w0
— BCCI (@BCCI) November 13, 2024
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌ను భారత్ అజేయంగా ముగించింది. లీగ్ దశలో, సూపర్ -4లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా.. ఫైనల్లోనూ దాయాదిని మట్టికరిపించింది. 147 పరుగుల ఛేదనలో 20 పరుగులకే మూడు వికెట్లు పడినా తిలక్ వర్మ (69 నాటౌట్) చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. సంజూ శాంసన్(24, శివం దూబే(33)ల సహకారంతో పాక్ బౌలర్లపై విరుచుకుపడిన తిలక్.. డెత్ ఓవర్లలో తన క్లాస్ బ్యాటింగ్‌తో అలరించాడు. హ్యారిస్ రవుఫ్ వేసిన 19వ ఓవర్లో కళ్లు చెదిరే సిక్సర్ బాది టీమిండియాను విజయానికి చేరువ చేశాడీ చిచ్చరపిడుగు. రింకూ సింగ్ ఫోర్ కొట్టడంతో 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించిన భారత్.. రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది.

‘ఫైనల్లో కీలక వికెట్లు పడడంతో నేను పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సిన సమయం వచ్చింది. 140 కోట్ల మంది భారతీయులకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాని మరువలేదు. అందుకే.. ఎలాగైనా టీమ్‌ను గెలిపించాలనుకున్నా. అందుకు ఏం చేయాలో అది మాత్రమే ఆలోచించాను. పాక్ క్రికెటర్లు స్లెడ్జింగ్ చేసినా.. బ్యాటుతోనే బదులివ్వాలని అనుకున్నా. మ్యాచ్ గెలిచిన తర్వాత దాయాది ఆటగాళ్లకు వైల్డ్ సెలబ్రేషన్‌తో గట్టిగా రిప్లై ఇచ్చాను. మీరంతా టీవీల్లో చూశారుగా’ అని తిలక్ వెల్లడించాడు