Tilak Varma : ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మ (Tilak Varma) స్వదేశం చేరుకున్నాడు. పాకిస్థాన్‌పై ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించిన అతడు సోమవారం హైదరాబాద్ విమానాశ్రయం(Hyderabad Airport)లో దిగాడు. దాంతో.. ఈ స్టార్ క్రికెటర్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఆసియా కప్ హీరోను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సోని బాల దేవీ సన్మానించారు. తిలక్‌ను చూసేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. కారులో ఎక్కిన తర్వాత టీమిండియా స్టార్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.
A CRAZY WELCOME OF TILAK VARMA IN HYDERABAD AFTER ASIA CUP WIN. 🤯pic.twitter.com/1HyeQ0qvi4
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 29, 2025
ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఆసియా కప్ ఫైనల్లో తిలక్ కలకాలం గుర్తిండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ నిర్దేశించిన 147 పరుగుల ఛేదనలో 20కే మూడు కీలక వికెట్లు పడినవేళ క్రీజులోకి వచ్చిన ఈ లెఫ్ట్ హ్యాండర్ జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నాడు. సంజూ శాంసన్(24), శివం దూబే(33)లతో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన తిలక్.. హ్యారిస్ రవుఫ్ వేసిన 19వ ఓవర్లో సిక్సర్‌తో జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. చివరి ఓవర్లో రింకూ సింగ్ బౌండరీతో టీమిండియా ఐదు వికెట్లతో పాక్‌ను చిత్తు చేసి తొమ్మిదోసారి ఛాంపియన్‌గా నిలిచింది.