స్టేషన్ ఘన్పూర్, జనవరి 22 : ఏషియన్ పారా త్రో బాల్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికైన నిరుపేద పారా ప్లేయర్ మాచర్ల కృష్ణవేణికి బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఎన్ఆర్ఐ హరీశ్ రెడ్డి బుధవారం ఆర్థికసాయం అందించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన కృష్ణవేణి మార్చి 28 నుంచి 30 వరకు కాంబోడియాలో జరిగే త్రోబాల్ పోటీల్లో పాల్గొననున్నది. రవాణా, హోటల్, ఫుడ్, రిజిస్ట్రేషన్, కోచింగ్, దుస్తులు, ప్రవేశ రుసుం వంటి ఖర్చులకు గాను రూ.89 వేలు చెల్లించాల్సి ఉంటుందని, దాతలు సహకరించాలంటూ ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ విషయం బీఆర్ఎస్ నాయకులు ఎన్ఆర్ఐ హరీశ్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే స్పందించిన ఆయన ఆర్థిక సహాయాన్ని హైదరాబాద్‌లో కేటీఆర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృష్ణవేణిని అభినందించారు. క్రీడా పోటీలలో పాల్గొనేందుకు పరోక్షంగా సహకరిస్తూ, మద్దతు ఇస్తున్న కేటీఆర్, హరీశ్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు కృష్ణవేణి కృతజ్ఞతలు తెలిపింది.