ICC Player oF The Month : ఐసీసీ ఈరోజు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్'(ICC Player oF The Month) అవార్డు ఆగస్టు నెల నామినీస్ పేర్లను వెల్లడించింది. మహిళల విభాగంలో ఆగస్టు నెలకుగానూ ఈ అవార్డు కోసం ముగ్గురు ఆల్‌రౌండర్లు పోటీ పడుతున్నారు. విశేషం ఏంటంటే.. మలేషియా నుంచి తొలిసారిగా ఓ క్రికెటర్ ఈ అవార్డు బరిలో నిలిచింది. ఆమె పేరు ఐన్నా అమిజాహ్ హషీం(Ainna Hamizah Hashim). అయితే.. ఆమెకు ఐర్లాండ్ ఆల్‌రౌండర్ అరెలే కెల్లె(Arlene Kelly), నెదర్లాండ్స్ ఆల్‌రౌండర్ ఇరిస్ జ్విల్లింగ్(Iris Zwilling)లు గట్టి పోటీదారులుగా మారారు.
ఇరవై మూడేళ్ల ఐన్నా ఆగస్టులో పరుగుల వరద పారించింది. మలేషియా ఉమెన్స్ క్వాడ్రాంగ్యులర్ టీ20 సిరీస్(Malaysia Women’s Quadrangular T20 series)లో 91 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అంతేకాదు ఒక మ్యాచ్‌లో 41 నాటౌట్‌తో కెరీర్లో మొదటిసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది.
ఐన్నా అమిజాహ్ హషీం
నాలుగు జట్లు తలపడిన ఈ టోర్నీలో మలేషియా జట్టు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఐసీసీ మహిళల టీ20 ఆసియా ప్రాంతం క్వాలిఫయర్స్(T20 WC Asia Region Qualifier)లో ఐన్నా అదరగొట్టింది. ఆరంభ పోరులో నేపాల్‌పై 14 పరుగులే ఇచ్చి 2 కీలక వికెట్లు తీసింది.
Player of the Match from today’s game was Arlene Kelly for her career-best figures of 5-12 👏👏👏👏👏#BackingGreen ☘️🏏 #FuelledByCerta pic.twitter.com/Xa6CPUJXKq
— Ireland Women’s Cricket (@IrishWomensCric) August 14, 2023
ఆల్‌రౌండర్ కెల్లే నెదర్లాండ్స్‌తో ఈ మధ్యే ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లో అద్భుతంగా రాణించింది. ఏకంగా 10 వికెట్లు తీసింది. మహిళల క్రికెట్లో అది కూడా ఒక బౌలర్ 10 వికెట్లు తీయడం ఇది రెండోసారి మాత్రమే. ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో అందులో ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. అందుకుగానూ ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నిలకడగా రాణిస్తున్న కెల్లె తాజాగా ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 22 వ స్థానం సంపాదించింది.
ఇరిస్ జ్విల్లింగ్
21 ఏళ్ల ఇరిస్ జ్విల్లింగ్ ఆగస్టులో దంచి కొట్టింది. ఈ నెదర్లాండ్స్ ఆల్‌రౌండర్ 29.66 స్ట్రయిక్ రేటుతో 178 రన్స్ చేసింది. ఐర్లాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో ఒక హాఫ్ సెంచరీ కొట్టింది. అంతేకాదు మూడు మ్యాచుల్లో జ్విల్లింగ్ 6 వికెట్లతో సత్తా చాటింది. 2019లో పొట్టి ఫార్మాట్లో అరంగేట్రం చేసిన జ్విల్లింగ్ ఇప్పటివరకూ 41 మ్యాచ్‌లు ఆడింది. 300 పరుగులు, 38 వికెట్లతో రాణించింది.