ODI World Cup 2023 | నెదర్లాండ్స్ వరల్డ్ కప్ బృందం ఇదే.. 15 మందిలో మన తెలుగు బిడ్డ
ODI World Cup 2023: నెదర్లాండ్స్(Netherlands) క్రికెట్ బోర్డు ఈరోజు వరల్డ్ కప్(ODI World Cup 2023) స్క్వాడ్‌ను ప్రకటించింది. స్కాట్ ఎడ్వర్డ్స్(Scott Edwards) కెప్టెన్‌గా 15మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. భారత సంతతికి చెందిన తేజ నిడమనూరు(Teja Nidamanuru) తుది బృందంలో....
ODI World Cup 2023: నెదర్లాండ్స్(Netherlands) క్రికెట్ బోర్డు ఈరోజు వరల్డ్ కప్(ODI World Cup 2023) స్క్వాడ్‌ను ప్రకటించింది. స్కాట్ ఎడ్వర్డ్స్(Scott Edwards) కెప్టెన్‌గా 15మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. మన తెలుగు బిడ్డ తేజ నిడమనూరు(Teja Nidamanuru) తుది బృందంలో చోటు దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్ అయిన తేజ ఈ మధ్యే ముగిసిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో అదరగొట్టాడు. అంతేకాదు అనుభవజ్ఞులైన రొఎల్ఫ్ వాన్ డెర్ మెర్వే(Roelof van der Merwe), కొలిన్ అక్రెమన్(Colin Ackermann)లు మళ్లీ జట్టులోకి వచ్చారు.
అయితే.. జింబాబ్వే వేదికగా జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్(ODI World Cup Qualifiers) పోటీల్లో వీళ్లిద్దరూ ఆడలేదు. కానీ, నిరుడు ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో అక్రెమన్ దంచి కొట్టాడు. పవర్ హిట్టర్ అయిన మెర్వె చురుకైన ఫీల్డర్ కూడా. దాంతో, వన్డే ఫార్మాట్లో వీళ్లు చెలరేగుతారనే నమ్మకంతో సెలెక్టర్లు ఈ ఇద్దరినీ జట్టులోకి తీసుకున్నారు.

The 15 men who will represent The Netherlands in the #CWC23 starting next month.
Wicketkeeper Batter Noah Croes and Fast Bowler Kyle Klein will be the two travelling reserves in the squad.
🇮🇳, here we come! 💪 pic.twitter.com/bTXvVzdZPM
— Cricket🏏Netherlands (@KNCBcricket) September 7, 2023
నెదర్లాండ్స్ వరల్డ్ కప్ స్క్వాడ్ : స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మాక్స్ ఓ డౌడ్, బాస్ డి లీడె, విక్రం సింగ్, తేజ నిడమనూరు, పౌల్ వాన్ మీకెరెన్, వాన్ డెర్ మెర్వే, కొలిన్ అక్రెమన్, లొగాన్ వాన్ బీక్, అర్యన్ డట్, రియాన్ క్లెయిన్, వెస్లే బరేసి, సకిబ్ జుల్ఫికర్, షరిజ్ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్బ్రెంచెట్.
భారత గడ్డపై అక్టోబర్ 5న ప్రపంచ కప్ షురూ కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ప్రపంచ కప్ పోటీలకు ముందు డచ్ జట్టు సెప్టెంబర్ 30న భారత్‌తో, అక్టోబర్ 3న ఆస్ట్రేలియాతో వామప్ మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 6న తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఢీ కొననుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇరుజట్ల ఆటగాళ్లు అభిమానులను అలరించనున్నాయి.
ఇవి కూడా చదవండి
ODI World Cup 2023 | ఆస్ట్రేలియా వరల్డ్ కప్ స్క్వాడ్.. స్టార్ పేసర్ 9 ఏళ్ల నిరీక్షణ ఫలించింది
Virat Kohli | నేపాల్ క్రికెటర్‌తో విరాట్ కోహ్లీ ఫన్నీ కామెంట్..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

