ODI World Cup 2023 : ఐసీసీ ఈవెంట్లలో తిరుగలేని ఆస్ట్రేలియా వరల్డ్ కప్(ODI World Cup 2023) స్క్వాడ్‌ను ప్రకటించింది. 15మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను ఆసీస్ క్రికెట్ బోర్డు(Australia Cricket) తాజాగా విడుదల చేసింది. ఎప్పటిలానే ఈసారి కూడా సెలెక్టర్లు ఆల్రౌండర్లకు పెద్ద పీట వేశారు. అందులో భాగంగానే 31 ఏళ్ల స్పీడ్‌స్టర్ సియాన్ అబాట్(Sean Abbott)కు చాన్స్ ఇచ్చారు. దాంతో, అతడి తొమ్మిదేళ్ల నిరీక్షణ ఫలించింది. అవును. ఈ కుడి చేతివాటం పేసర్ తొలిసారి ప్రపంచ కప్‌లో ఆడబోతున్నాడు.
ఐదుసార్లు చాంపియన్ అయిన కంగారు జట్టు ఈసారి ట్రోఫీపై కన్నేసింది. అందుకని మిచెల్ మార్ష్, కామెరూన్ గ్రీన్, మార్క్ స్టోయినిస్ వంటి విధ్వంసక ఆల్రౌండర్లను తీసుకుంది.కెప్టెన్ ప్యాట్ కమిన్స్, సియాన్ అబాట్‌లు లోయర్ ఆర్డర్లో ధనాధన్ బ్యాటింగ్ చేయగల సమర్థులు. ఇక అష్టోన్ అగర్, గ్లెన్ మాక్స్వెల్, ఆడం జంపాతో ఆసీస్ స్పిన్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది.
స్పీడ్‌స్టర్ సియాన్ అబాట్
Presenting your 15-player men’s provisional squad for the 2023 World Cup!
The final 15-player squad will be confirmed later this month 🇦🇺 #CWC23 pic.twitter.com/wO0gBbadKi
— Cricket Australia (@CricketAus) September 6, 2023
ఆస్ట్రేలియా వరల్డ్ కప్ స్క్వాడ్ : స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, కామెరూన్ గ్రీన్, మార్క్ స్టోయినిస్, అలెక్స్ క్యారీ, జోష్ హేజెల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, అష్టోన్ అగర్, గ్లెన్ మాక్స్వెల్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్) సియాన్ అబాట్, ఆడం జంపా.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఆసీస్ సెలెక్టర్లు 18మంది బృందాన్ని ఎంపిక చేశారు. కానీ, వాళ్లలో ముగ్గురిని మాత్రమే వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోలేదు. వాళ్లు ఎవరంటే.. నాథన్ ఎల్లిస్, అరోన్ హర్డియర్, తన్వీర్ సంఘా. అయితే.. వరల్డ్ కప్ స్క్వాడ్‌లో మార్పులు చేసుకోవడానికి సెప్టెంబర్ 28 వరకు గడువు ఉంది. దాంతో, ఆలోపు తుది బృందంపై స్పష్టత రానుంది.
భారత గడ్డపై అక్టోబర్ 5న ప్రపంచ కప్ షురూ కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఇక ఆస్ట్రేలియా జట్టు తొలి మ్యాచ్‌లో భారత జట్టును ఢీ కొననుంది. అయితే.. అంతకంటే ముందే ఇరుజట్లు మూడు వన్డే సిరీస్‌లో ఎదురుపడనున్నాయి. భారత్, ఆసీస్ మధ్య తొలి వన్డే సెప్టెంబర్ 22న జరుగనుంది.