LSG vs RR : సొంతగడ్డపై ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన లక్నో సూపర్ జెయింట్స్(Luckonw Super Giants) నిలబడింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(63), దీపక్ హుడా(50)లు అర్ద శతకాలతో జట్టును ఆదుకున్నారు. అయితే. 13వ ఓవర్లో అశ్విన్ ఈ జోడీని విడదీశాడు. అర్ధ సెంచరీతో జోరుమీదున్న హుడాను బోల్తా కొట్టించాడు. దాంతో, మూడో వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం రాహుల్ జతగా డేంజరస్ నికోలస్ పూరన్(5) ఆడుతున్నాడు. 13 ఓవర్లకు స్కోర్.. 135/3
టాస్ ఓడిన లక్నోను రాజస్థాన్ పేసర్లు వణికించారు. ఫామ్‌లో ఉన్న క్వింటన్ డికాక్(8)ను బౌల్ట్ బౌల్డ్ చేయగా.. గత మ్యాచ్‌లో సెంచరీతో గెలిపించిన మార్కస్ స్టోయినిస్(0)ను సందీప్ శర్మ గోల్డెన్ డక్‌గా వెనక్కి పంపాడు. దాంతో, 11 పరుగులకే రెండు వికెట్లు పడిన దశలో రాహుల్, హుడాలు ఆచితూచి ఆడారు. కాసింత కుదరుకున్నాక ఇద్దరూ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీలు సాధించి జట్టు స్కోర్ 120 దాటించారు.