Maharashtra | కొల్హాపూర్: ఐపీఎల్లో క్రికెట్ ఫ్యాన్స్ పిచ్చి తారాస్థాయికి చేరింది. తమ అభిమాన ప్లేయర్లను ఎవరైనా దూషిస్తే తట్టుకోలేక చచ్చేటట్లు బాదే దూరం వెళ్లింది. వివరాల్లోకెళితే సరిగ్గా వారం క్రితం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్‌శర్మ ఔట్..ఓ అభిమాని ప్రాణం తీసింది.
హన్మంత్వాడి గ్రామంలో బందోపంత్ తిబ్లే (63), బల్వంత్ తో పాటు సాగర్ ముగ్గురు కలిసి మ్యాచ్ చూశారు. అయితే రోహిత్ ఔటైనా తర్వాత తిబ్లే సంబురాలు చేసుకున్నా డు. దీంతో తమ అభిమాన క్రికెటర్ ఔటైనందుకు సంతోష పడుతావా అంటూ తిబ్లేపై బల్వంత్, సాగర్ దాడికి దిగారు. దీంతో గాయాల పాలైన తిబ్లే శనివారం తనువు చాలించాడు.