IPL Mega Auction : పొట్టి క్రికెట్ లీగ్స్‌లో పాపులర్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల. ఒక్క సీజన్ ఆడినా చాలు ఆదాయానికి ఆదాయంతో పాటు జాతీయ జట్టుకు ఆడే అవకాశం.. ఆపై ప్రకటనలు ఇలా ఆటగాళ్లకు బోలెడన్ని లాభాలు ఉంటాయి. అందుకనే ఐపీఎల్ వేలంలో ఎందరో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఈసారి ఇటలీ దేశం నుంచి తొలిసారి వేలంలో పాల్గొంటున్న యువ ఆటగాడి పేరు మార్మోగిపోతోంది. అతడి పేరు.. థామస్ జాక్ డ్రాకా (Thomas Jack Draca).
ఇటలీ తరఫున తొలిసారి ఐపీఎల్ వేలంలో నిలిచిన థామస్‌కు 24 ఏండ్లు. ఈ పొడగరి పేసర్ రూ.35 లక్షల కనీస ధరకు తన పేరు రిజిష్టర్ చేసుకున్నాడు. మరి, అతడిని ఎవరైనా కొంటారా? లేదా? అనేది నవంబర్ 24, 25వ తేదీల్లో తెలియనుంది. థామస్ జాక్‌కు అంతర్జాతీయ టీ20ల అనుభవం తక్కువే.
If you’re all wondering who’s Italy’s Thomas Draca, well, here’s a glimpse of the man in action 👀pic.twitter.com/NkAGePbRRg
— FanCode (@FanCode) November 6, 2024
ఇప్పటివరకూ అతడు ఇటలీ తరఫున 4 టీ20లు ఆడి 8 వికెట్లు పడగొట్టాడు. ఆపై జీటీ20 కెనడా టోర్నీలో బ్రాంప్టన్ వొల్వ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. పేసర్‌గా రాణిస్తున్న అతడని ఐఎల్టీ20(ILT20) 2025 కోసం ఎంఐ ఎమిరేట్స్ (MI Emirates)జట్టు కొనుగోలు చేసింది. దాంతో, ఐపీఎల్‌లోనూ తనకు మంచి గిరాకీ వస్తుందని థామస్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఐపీఎల్లో ఎలాగైనా అరంగేట్రం చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
🚨 𝐈𝐓𝐀𝐋𝐈𝐀𝐍 𝐒𝐄𝐍𝐒𝐀𝐓𝐈𝐎𝐍 𝐈𝐍 𝐈𝐏𝐋 🚨
Innings – 4
Wickets – 8
Avg – 8.50
Eco – 4.25
Sr -12.0
BBI – 3/9This is 24 Years Old 𝐓𝐡𝐨𝐦𝐚𝐬 𝐉𝐚𝐜𝐤 𝐃𝐫𝐚𝐜𝐚 from Italy….!!!!! 🇮🇹#IPLAuction2025 https://t.co/1J964gJRXH pic.twitter.com/Y7yTysfnEN
— Pratyush Halder (@pratyush_no7) November 5, 2024
మూడేండ్లకు ఓసారి జరిగే మెగా వేలం ప్రతి ఫ్రాంచైజీకి స్క్వాడ్‌ను పూర్తిగా మార్చుకునే అవకాశాన్ని ఇస్తుంది. అందుకని వేలంలో ప్రతిభావంతులను, అనుభవజ్ఞులను కొనేందుకు 10 జట్ల యజమానులు సిద్ధమవుతున్నారు. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో వేలం జరుగనుంది. ఈసారి 1,574 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు.