Mango Leaves | షుగర్‌కు అద్భుతంగా పనిచేసే ఆకులు ఇవి.. కనిపిస్తే విడిచిపెట్టకుండా తెచ్చుకోండి..!
మామిడికాయల సీజన్ అయితే అయిపోయింది. మామిడికాయలను తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కేవలం పండ్లే కాదు, మామిడి ఆకులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి.
Mango Leaves | మామిడికాయల సీజన్ అయితే అయిపోయింది. మామిడికాయలను తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కేవలం పండ్లే కాదు, మామిడి ఆకులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల మామిడి ఆకులతో మనం పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. మామిడి ఆకులు మనకు ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటాయి. వీటిని పలు విధాలుగా వాడి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మామిడి ఆకుల్లో విటమిన్లు సి, బి, ఎ లతోపాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల మామిడి ఆకులతో మన శరీరానికి పోషణ లభిస్తుంది.
షుగర్‌కు..
మామిడి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగుతుంటే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇలా చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇక ప్రీ డయాబెటిస్ ఉన్నవారు కూడా మామిడ ఆకులతో తయారు చేసిన నీళ్లను తాగుతుంటే డయాబెటిస్ పూర్తిగా రాకుండా నివారించవచ్చు. దీంతో ట్యాబ్లెట్లను వాడాల్సిన అవసరం తప్పుతుంది.
హైబీపీకి..
మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి బీపీని తగ్గిస్తాయి. రక్తనాళాలను ఆరోగ్యంగా మారుస్తాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. అధిక బరువును తగ్గించడంలోనూ మామిడి ఆకులు ఎంతగానో పనిచేస్తాయి. ఈ ఆకులతో తయారు చేసిన నీళ్లను తాగితే లిపిడ్ మెటబాలిజం మెరుగు పడుతుంది. దీంతో కొవ్వులు సులభంగా కరిగిపోతాయి. దీని వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతారు. మామిడి ఆకుల టీ అనేది నాచురల్ మెడిసిన్ మాదిరిగా పనిచేస్తుంది. అందువల్ల శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వు సైతం కరిగిపోతుంది.
శ్వాసకోశ సమస్యలకు..
మామిడి ఆకులను ఉపయోగించి ఆస్తమా, బ్రాంకైటిస్, జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించుకోవచ్చు. మామిడి ఆకులతో తయారు చేసిన టీని తాగడం వల్ల గొంతు నొప్పి, మంట తగ్గుతాయి. అలాగే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు. మామిడి ఆకుల నీళ్లను తాగుతుంటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా విరేచనాలు తగ్గుతాయి. మామిడి ఆకులు జీర్ణాశయ ఎంజైమ్‌లను తయారు చేయడంలో సహాయం చేస్తాయి. దీంతో మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది.
ఆర్థరైటిస్ నొప్పులకు..
ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడుతున్నవారు మామిడి ఆకులను నేరుగా తినవచ్చు లేదా వాటితో తయారు చేసిన నీళ్లను తాగవచ్చు. దీంతో నొప్పులు తగ్గుతాయి. మామిడి ఆకుల్లో అనాల్జెసిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ నీళ్లను సేవిస్తుంటే నొప్పుల నుంచి బయట పడవచ్చు. వాపులు కూడా తగ్గుతాయి. చర్మంపై కాలిన గాయాలు, దద్దుర్లు, మొటిమలను తగ్గించడంలోనూ మామిడి ఆకులు ఉపయోగపడతాయి. ఈ ఆకుల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మంపై వచ్చే దురద తగ్గుతుంది. ఎరుపుదనం పోతుంది. చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఇలా మామిడి ఆకులతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Mango leaves
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

