హార్సెన్స్ (డెన్మార్క్) : థామస్ కప్‌లో ఇదివరకే క్వార్టర్స్ బెర్తు ఖాయం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ జట్టు.. చైనాతో జరిగిన తమ ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో పోరాడి ఓడింది. ఇరుజట్ల మధ్య ఇక్కడ జరిగిన గ్రూప్-ఏ ఆఖరి పోరులో భారత్.. 2-3తో ఓటమిపాలైంది. సింగిల్స్‌లో లక్ష్యసేన్, డబుల్స్ పోరులో సాత్విక్, చిరాగ్ ద్వయం ఓడి చైనాకు 2-0 ఆధిక్యం దక్కినా రెండో సింగ్స్‌లో ఆయుష్ శెట్టి అద్భుత పోరాటంతో భారత్ పుంజుకుంది.
ఆయుష్.. 17-21, 21-13, 21-15తో వెంగ్ హాంగ్ యాంగ్‌ను ఓడించి భారత్‌ను పోటీలోకి తెచ్చాడు. కానీ రెండో డబుల్స్‌లో హరిహరన్, అర్జుణ్ జోడీ ప్రత్యర్థికి తలవచండంతో చైనా తన ఆధిక్యాన్ని 3-1కి పెంచుకుంది. ఆఖరి సింగిల్స్‌లో సీనియర్ షట్లర్ ప్రణయ్.. 20-22, 21-19, 21-11తో లు గువాంగ్ జు ను ఓడించి ప్రత్యర్థి ఆధిక్యాన్ని 3-2కు తగ్గించాడు.