అహ్మదాబాద్: రంజీ ట్రోఫీ(Ranji Trophy) ఫైనల్లో కేరళ తొలి సారి ప్రవేశించిన విషయం తెలిసిందే. గుజరాత్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ డ్రా అయినా.. ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్‌తో ఆ జట్టు రంజీ ఫైనల్స్‌కు ఎంటర్ అయ్యింది. కేరళ ఆ చరిత్ర సృష్టించడానికి.. హెల్మెట్ పాత్ర కూడా ఉన్నది. గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో చివరి బ్యాట్స్‌మెన్ ఔటైన తీరు కొంత అయోమయానికి దారి తీసింది. మరో రెండు పరుగులు చేస్తే.. కేరళ ఆధిక్యాన్ని దాటేస్తుందనుకున్న సమయంలో.. గుజరాత్ బ్యాటర్ ఔటయ్యాడు. అయితే ఆ ఔట్.. ఓ భిన్నమైన రీతిలో జరిగింది.
1⃣ wicket in hand
2⃣ runs to equal scores
3⃣ runs to secure a crucial First-Innings LeadJoy. Despair. Emotions. Absolute Drama! 😮
Scorecard ▶️ https://t.co/kisimA9o9w#RanjiTrophy | @IDFCFIRSTBank | #GUJvKER | #SF1 pic.twitter.com/LgTkVfRH7q
— BCCI Domestic (@BCCIdomestic) February 21, 2025
అర్జన్ నాగవస్వల్లా భారీ షాట్ కొట్టగా.. బంతి నేరుగా వెళ్లి ఫార్వర్డ్ షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సల్మన్ నిజార్ హెల్మెట్‌కు తగిలింది. పవర్ఫుల్ షాట్ కావడంతో.. ఆ బంతి బౌన్స్ అయ్యింది. స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సచిన్ బే చేతుల్లోకి ఆ బంతి వెళ్లింది. కానీ నిజానికి ఆ టైంలో ఏం జరిగిందో అంపైర్లు గ్రహించలేకపోయారు. డగౌట్లో ప్లేయర్లు కూడా కొంత కన్ఫ్యూజన్కు గురయ్యారు. ఇక కామెంటేటర్లు కూడా అక్కడ జరిగిన సీన్‌ను అర్థం చేసుకోలేకపోయారు. తొలుత ఫీల్డ్ అంపైర్లు ఫీల్డర్ గురించి ఆరా తీశారు. ఔట్ ఇవ్వడానికి ముందు.. వాళ్లు నిజార్ గురించి తెలుసుకున్నారు.
అయితే క్రికెట్ రూల్స్ ప్రకారం.. చివరకు బ్యాటర్‌ను ఔట్‌గా ప్రకటించారు. బంతి హెల్మెట్‌కు తగిలి నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లడంతో గుజరాత్ బ్యాటర్ ఔటైనట్లు పేర్కొన్నారు. ఒకవేళ బంతి హెల్మెట్‌కు తాకకుండా ఉంటే, అప్పుడు దాదాపు గుజరాత్ ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కానీ బీసీసీఐ, ఐసీసీ రూల్స్ ప్రకారం.. బ్యాటర్‌ను ఔట్‌గా ప్రకటించడంతో.. కేరళ ప్లేయర్లు చిందేశారు.
ప్లేయర్ లేదా ఫీల్డర్.. రక్షణ కోసం ఏ పరికరాన్ని ధరించినా.. ఆ భాగానికి బంతి తగిలితే ఔట్‌గానే ప్రకటిస్తారు. బీసీసీఐ రూల్స్‌లోని క్లాజ్ 28.2 ప్రకారం.. ఫీల్డర్ ఏదైనా తన శరీర భాగంతో ఫీల్డింగ్ చేయవచ్చు. ఇక్కడ ఫీల్డర్ సల్మాన్.. తన రక్షణ కోసం హెల్మెట్ ధరించాడు. అందుకే సచిన్ అందుకున్న క్యాచ్ న్యాయమైందని రూల్స్ పేర్కొన్నాయి.
ఫీల్డర్ లేదా వికెట్ కీపర్ ధరించే హెల్మెట్‌కు బంతి తగిలిన తర్వాత క్యాచ్ పట్టినా, లేక రనౌట్ అయినా, స్టంప్ చేసినా.. ఔట్‌గానే పరిగణిస్తారు. ఐసీసీ కొత్త రూల్ ఇదే చెబుతోంది.