ముంబై: ఇండియన్ టీమ్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి రిలేషన్షిప్లో ఉన్నారన్న వార్తలు కొంతకాలంగా వస్తూనే ఉన్నాయి. వీళ్లిద్దరూ దీనిపై ఇప్పటి వరకూ నోరు విప్పకపోయినా.. అప్పుడప్పుడూ కలిసి కనిపిస్తుండటం, సోషల్ మీడియాలో ఫొటోలు వీళ్ల మధ్య బంధాన్ని బయటపెడుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అతియా.. రాహుల్‌తో కలిసి ఇంగ్లండ్‌లోనే ఉంది. కానీ ఆమె తండ్రి, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి మాత్రం మరో రకంగా చెబుతున్నాడు.
అతియా ఇంగ్లండ్‌లో ఉన్న మాట నిజమే కానీ.. ఆమె తన సోదరుడు అహాన్‌తో కలిసి వెళ్లిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇద్దరూ హాలీడే కోసం యూకే వెళ్లారని, కావాలంటే వాళ్లనే అడిగి తెలుసుకోండని సునీల్ అన్నాడు. ఇక రాహుల్, అతియా ఓ ఐవేర్ బ్రాండ్‌కు అంబాసిడర్లు కావడం, ఇద్దరూ కలిసి ఆ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడంపైనా అతడు స్పందించాడు.
దీనిపై వాళ్లనే అడగండి. యాడ్ విషయానికి వస్తే వాళ్లిద్దరూ చాలా బాగా కనిపిస్తున్నారు. వాళ్ల జోడీ బాగుంది కదా? అని సునీల్ అనడం విశేషం. గతేడాది కూడా కేఎల్ రాహుల్‌పై సునీల్ శెట్టి ప్రశంసలు కురిపించాడు. వాళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారు. వాళ్లు హ్యాపీగా ఉండటమే మాకు కావాలి. మేము సంతోషంగా ఉన్నాం అని అన్నాడు.