ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)ను వచ్చే ఏడాది నుంచి దీపావళి పండుగ జరిగే సమయంలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ కార్యదర్శి జై షా శుక్రవారం సూచనప్రాయంగా ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. ఇటీవలే ముగిసిన తొలి సీజన్‌కు భిన్నంగా ఈసారి ఒకే నగరానికి పరిమితం చేయకుండా ఇంటాబయటా ఫార్మాట్లో మ్యాచ్ లు నిర్వహించేందుకు బోర్డు యోచిస్తున్నది.
‘రెగ్యులర్‌గా జరిగే సమయంలో కాకుండా దీపావళి రోజుల్లో లీగ్ నిర్వహించాలనుకుంటున్నాం. ఒకే ఏడాదికి రెండు సీజన్లు గాకుండా ఒక సీజన్‌కే పరిమితమవుతాం. మహిళల క్రికెట్‌కు మంచి ఆదరణ లభిస్తున్నది. భవిష్యత్‌లో డబ్ల్యూపీఎల్‌కు మరింత జనాదరణ లభించవచ్చు. ఆసియా కప్‌పై మిగతా దేశాల స్పందన కోసం వేచిచూస్తున్నాం’ అని అన్నాడు.