హైదరాబాద్, ఆట ప్రతినిధి: జర్మనీ వేదికగా జూలైలో జరుగనున్న వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌కు హైదరాబాద్‌కు చెందిన తీర్థ శశాంక్ ఎంపికయ్యాడు. ఇటీవల జైపూర్‌లో జరిగిన ఆల్ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో రజత పతకం సాధించడం ద్వారా శశాంక్ బెర్తు దక్కించుకున్నాడు.
మాజీ డేవిస్‌కప్ జూనియర్ ప్లేయర్ అయిన శశాంక్..అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. జాతీయ జట్టుకు ఆడబోతున్నందుకు చాలా గర్వంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ప్రస్తుతం కోచ్ ఆనంద్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న శశాంక్‌కు సానియామీర్జా, ఇమ్రాన్ మీర్జా మెంటార్లుగా వ్యవహరిస్తున్నారు.