దీపిక బృందానికి పసిడి
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-2 టోర్నీలో భారత మహిళల రికర్వ్ జట్టు మరోసారి సంచలన ప్రదర్శనతో అదరగొట్టింది. వెటరన్ ఆర్చర్ దీపిక కుమారి నేతృత్వంలోని అంకితా భకత్, కుంకుమ్ మొహాద్తో కూడిన భారత బృందం.. ఫైనల్లో 5-4తో టైటిల్ ఫేవరెట్లుగా ఉన్న చైనాను ఓడించి స్వర్ణం గెలుచుకుంది.
- ఫైనల్లో చైనాను చిత్తుచేసిన భారత రికర్వ్ జట్టు
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-2 టోర్నీలో భారత మహిళల రికర్వ్ జట్టు మరోసారి సంచలన ప్రదర్శనతో అదరగొట్టింది. వెటరన్ ఆర్చర్ దీపిక కుమారి నేతృత్వంలోని అంకితా భకత్, కుంకుమ్ మొహాద్తో కూడిన భారత బృందం.. ఫైనల్లో 5-4తో టైటిల్ ఫేవరెట్లుగా ఉన్న చైనాను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. నాలుగు సెట్లలో ఇరుజట్ల స్కోర్లు 4-4తో సమమవగా షూటాఫ్ ద్వారా తేలిన ఫలితంలో భారత ఆర్చర్లు ఏకాగ్రత కోల్పోకుండా పసిడిని గురిచూసి కొట్టారు.
తొలి సెట్లో 54-53 (2 సెట్ పాయింట్లు)తో ఆధిక్యంలో నిలిచిన భారత అమ్మాయిలు.. తర్వాత రెండు సెట్లలో (52-55, 56-57 (చైనాకు 4 సెట్పాయింట్లు))తో వెనుకబడ్డారు. కానీ ఆఖరి సెట్లో 54-53తో భారత్ ఖాతాలో మరో రెండు సెట్ పాయింట్లు చేరడంతో షూటాఫ్ అనివార్యమైంది.
షూటాఫ్‌లో దీపిక బృందం.. 28 పాయింట్లు స్కోరు చేయగా చైనా 26 మాత్రమే కొట్టగలిగింది. భారత రికర్వ్ మహిళల జట్టుకు మూడేండ్ల తర్వాత ఇదే తొలి పతకం. దీపికకు మాత్రం ప్రపంచకప్‌లలో ఇది ఏకంగా 12వ మెడల్. ఈ టోర్నీలో రికర్వ్ జట్టు ఏడు పతకాలు గెలువగా ఆ ఏడింటిలోనూ దీపిక ఉండటం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

