న్యూఢిల్లీ: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్ ఆరో సీజన్‌కు వేళయైంది. అహ్మదాబాద్ వేదికగా ఈనెల 31 నుంచి లీగ్ మొదలుకాబోతున్నది. పోటీల తొలి రోజు డబుల్ హెడర్‌తో లీగ్‌కు తెరలేవనుంది.
సీజన్-2 విన్నర్ దబాంగ్ ఢిల్లీ, జైపూర్ ప్యాట్రియాట్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుండగా, ఢిపెండింగ్ చాంపియన్ డెంపో గోవా చాలెంజర్స్, అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్ మరో పోరులో తలపడనున్నాయి. ఈసారి కోల్‌కతా థండర్‌బ్లేడ్స్ చేరికతో లీగ్‌లో ఫ్రాంచైజీల సంఖ్య ఎనిమిదికి చేరింది.