హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ జిల్లాల క్రికెట్ అసోసియేషన్(టీడీసీఏ) అండర్-17 వన్డే టోర్నీ సోమవారం మొదలైంది. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో గ్రామీణ క్రికెట్ అభివృద్ధికి టీడీసీఏ చేస్తున్న కృషి అభినందనీయం.
గ్రామీణ ప్రాంత క్రికెటర్లను వెలుగులోకి తెచ్చేందుకు ఇలాంటి టోర్నీలు నిర్వహించాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీసీఏ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.