గీసుగొండ, జనవరి 11 : వరంగల్ జిల్లా గీసుగొండ మండల కేంద్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు శనివారం ముగిశాయి. మూడు రోజుల పాటు సాగిన క్రీడల్లో రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలకు చెందిన పురుషుల, మహిళల జట్లతో పాటు ఒక పోలీస్ కానిస్టేబుల్ టీమ్ తలపడ్డాయి.
శనివారం జరిగిన ఫైనల్స్లో పురుషుల విభాగంలో వరంగల్ జట్టు 33-29 తేడాతో రంగారెడ్డిపై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. హైదరాబాద్కు మూడో స్థానం దక్కింది. మహిళల కేటగిరీలో రంగారెడ్డి టీమ్ 23-18 తేడాతో పాలమూరుపై గెలిచి చాంపియన్గా నిలిచింది.