Nikhat Zareen | హైదరాబాద్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ): ప్రపంచ బాక్సింగ్ చాంపియన్, అర్జున్ అవార్డు గ్రహీత నిఖత్ జరీన్.. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ పోలీస్)గా తన జాయినింగ్ రిపోర్ట్‌ను డీజీపీ జితేందర్‌కు బుధవారం అందజేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ బాక్సింగ్‌లో రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్, ఏషియన్ గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్‌ను గెలిచింది. ఇటీవల పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లోనూ ఆమె పాల్గొన్నారు. నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిఖత్‌కు అడిషనల్ డీజీపీ, ఇన్చార్జి పర్సనల్ మహేశ్ భగవత్ శుభాకాంక్షలు తెలిపారు.