IND Vs SA | చెన్నై: భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. వన్డే, టెస్టు సిరీస్‌లో వరుస అపజయాలు మూటగట్టుకున్న సఫారీలు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్‌ను 12 పరుగులతో ఓడించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకు బ్రిట్స్ (81), కాప్ (57) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది.
ఛేదనలో భారత్ 20 ఓవర్లలో 177/4 వద్దే ఆగిపోయింది. జెమీమా రోడ్రిగ్స్ (53 నాటౌట్), స్మృతి మంధాన (46), హర్మన్‌ప్రీత్ కౌర్ (35 నాటౌట్) పోరాడినా భారత్‌కు నిరాశ తప్పలేదు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం ఇదే వేదికపై జరుగనుంది.