మంగళవారం 07 జూలై 2020
Sports - May 07, 2020 , 16:21:30

ఆ శ‌బ్దం స‌మ్మోహ‌న ప‌రిచింది: బ‌్రెట్‌లీ

ఆ శ‌బ్దం స‌మ్మోహ‌న ప‌రిచింది: బ‌్రెట్‌లీ

ముంబై:  టీమ్ఇండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ బ్యాట్ నుంచి వ‌చ్చే శ‌బ్ధం త‌న‌ను సమ్మోహ‌న ప‌రిచే విధంగా ఉంటుంద‌ని ఆస్ట్రేలియా మాజీ పేస‌ర్ బ్రెట్ లీ అన్నాడు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ‌టంతో ఇండ్ల‌కే ప‌రిమిత‌మైన క్రికెట‌ర్లు సామాజిక మాధ్య‌మాల ద్వారా అభిమానుల‌కు అందుబాటులో ఉంటున్నారు. ఈ క్ర‌మంలో బ్రెట్‌లీ మాట్లాడుతూ..

`మొద‌టి సారి రోహిత్ శ‌ర్మ‌ను చూసిన‌ప్పుడే అత‌డు గొప్ప ఆట‌గాడ‌వుతాడ‌ని భావించా. అత‌డు బంతిని ఎదుర్కొంటున్న స‌మ‌యంలో వ‌చ్చే శ‌బ్ధం చాలా అద్భుతంగా అనిపించింది. ఆ సౌండ్ వింటే బాల్ స‌రిగ్గా బ్యాట్ మ‌ధ్య‌లో తానిక‌న‌ట్లు అవ‌గ‌త‌మైంది` అని బ్రెట్ లీ అన్నాడు. భార‌త మాజీ పేస‌ర్ ఇర్ఫాన్ ఫ‌ఠాన్ కూడా బ్రెట్‌లీ వ్యాఖ్య‌ల‌తో ఏకీభ‌వించాడు.


logo