హైదరాబాద్, ఆట ప్రతినిది: రగ్బీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌ను ఆతిథ్య హైదరాబాద్ హీరోస్ జట్టు ఓటమితో ఆరంభించింది. గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో బెంగళూరు బ్రేవ్హారట్స్ 2821 తేడాతో ఆతిథ్య హీరోస్‌పై విజయం సాధించింది. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి లీగ్‌ను ప్రారంభించారు.