Hyderabad | జైపూర్: హైదరాబాద్, రాజస్థాన్ మధ్య రంజీ గ్రూపు-బీ మ్యాచ్ డ్రా గా ముగిసింది. శనివారం ఓవర్‌నైట్ స్కోరు 36/0 నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది. కొడిమెల హిమతేజ(101 నాటౌట్) అజేయ సెంచరీతో విజృంభించగా, ఓపెనర్ తన్మయ్ అగర్వాల్(79) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు.
అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా రాజస్థాన్‌కు 3 పాయింట్లు దక్కగా, హైదరాబాద్ ఒక పాయింట్‌కు పరిమితమైంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచిన హైదరాబాద్(8) ఆరో స్థానంలో కొనసాగుతున్నది.