హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్, తమిళనాడు మధ్య రంజీ పోరు ఆసక్తికరంగా సాగుతున్నది. స్థానిక రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా మంగళవారం మొదలైన మ్యాచ్‌లో హైదరాబాద్ మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్ గెలిచిన తమిళనాడు..హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పరిస్థితులను అనుకూలంగా మలుచకుంటూ ప్రత్యర్థి బౌలర్లు చెలరేగడంతో ఓ దశలో 46 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.
అభిరాత్రెడ్డి(0), రోహిత్ రాయుడు(0), జావిద్ అలీ(6) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ తరుణంలో కెప్టెన్ తన్మయ్ అగర్వాల్(210 బంతుల్లో 116 నాటౌట్, 14 ఫోర్లు) అజేయ సెంచరీతో జట్టును ముందుండి నడిపాడు. ఆల్‌రౌండర్ రవితేజ(72)తో కలిసి ఐదో వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.