IND vs NA 3rd ODI : టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లకు బారత బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఓవర్ నాలుగో బంతికి అర్షదీప్ బౌలింగ్‌లో ఓపెనర్ హెన్రీ నికోల్స్ డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత రెండో ఓవర్ తొలి బంతికి హర్షిత్ రాణా బౌలింగ్‌లో మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (5) ఔటయ్యాడు.
కేవలం ఐదు పరుగులకే రెండు కీలక ఓట్లు చేజారడంతో ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్, విల్ యంగ్ నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 13వ ఓవర్ తొలి బంతికి విల్ యంగ్ (30) హర్షిత్ రాణా బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి న్యూజిలాండ్ జట్టు స్కోర్ 13.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 63 పరుగులు.
ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ డారిల్ మిచెల్‌కు జత కలిశాడు. 15 ఓవర్ల ఆట ముగిసే సమయానికి స్కోర్‌ను 71 పరుగులకు చేర్చారు. మిచెల్ 29 పరుగులతో, ఫిలిప్స్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా ఈ మూడు వన్డేల సిరీస్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1 తో సమంగా ఉన్నాయి. ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే సిరీస్ వారికే సొంతం కానుంది.