కొత్తపల్లి, నవంబర్ 7: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో జాతీయస్థాయి కరాటే పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే పోటీలను ప్రముఖ సినీనటుడు సుమన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడం ద్వారా శారీరకంగా, ధృడంగా మారడంతో పాటు మానసికంగా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందన్నారు.
కాంటినెంటల్ షోటోకాన్ కరాటే ఇండియా నేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నీలో పలు రాష్ర్టాల నుంచి 1200 మంది ప్లేయర్లు కటా, కుమిటీ విభాగాల్లో పోటీపడుతున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు శ్రీనివాస్, అనంతన్, ప్రవీణ్ పాల్గొన్నారు.