పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత మహిళల హాకీ జట్టు వైఫల్య ప్రదర్శన కొనసాగుతున్నది. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్లోనూ భారత్.. 2-3తో పోరాడి ఓడింది.
భారత్ తరఫున నవ్నీత్ కౌర్ (35వ నిమిషం), లల్రెమ్సియామి (59 ని.)లో గోల్స్ చేశారు. ఆస్ట్రేలియా నుంచి గ్రేస్ స్టీవార్ట్ (2 ని.) జేడ్ స్మిత్ (36 ని.), హెయిస్ (42 ని.)లో గోల్స్ కొట్టారు.