ఆక్లాండ్: ఎఫ్ఐహెచ్ మహిళల నేషన్స్ కప్ టోర్నమెంట్లో భారత మహిళల హాకీ జట్టు రెండోసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో 2-0 గోల్స్ తేడాతో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టును చిత్తు చేసింది. టోర్నీలో అజేయంగా నిలిచిన సలిమా టెటె నేతృత్వంలోని భారత జట్టు.. ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించింది.
ఈ విజయంతో వచ్చే సీజన్ ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల ప్రో లీగ్ లో ఆడేందుకు అర్హత సాధించింది. మ్యాచ్ ప్రారంభమైన 4వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను నవ్‌నీత్ కౌర్ పవర్ఫుల్ హిట్‌తో గోల్‌గా మలిచి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించింది.మ్యాచ్ 15వ నిమిషంలో సునేలిత గోల్‌తో భారత్ విజయం ఖరారైంది.