క్రాంతి కమాల్.. ఇంగ్లండ్ ఢమాల్
క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో చారిత్రక టెస్టు మ్యాచ్‌ను భారత అమ్మాయిలు తమ చేతుల్లోకి తీసుకున్నారు. తొలి రోజు బ్యాట్‌తో మెప్పించిన టీమిండియా రెండో రోజు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది.
- 5 వికెట్లతో మెరిసిన యువ పేసర్
- 170 రన్స్‌కే ఆతిథ్య జట్టు ఆలౌట్
- రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 154/1
లండన్: క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో చారిత్రక టెస్టు మ్యాచ్‌ను భారత అమ్మాయిలు తమ చేతుల్లోకి తీసుకున్నారు. తొలి రోజు బ్యాట్‌తో మెప్పించిన టీమిండియా రెండో రోజు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. పేసర్ క్రాంతి గౌడ్ (5/37) కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించడంతో ఆతిథ్య జట్టును 170 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో భారత్‌కు 115 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇంగ్లిష్ టీమ్‌లో ఎమీ జోన్స్ (52), కెప్టెన్ సివర్ బ్రంట్ (44), మయా బుషెర్ (23) తప్ప మిగతా వాళ్లు తేలిపోయారు. అలీస్ కాప్సీ (9), హెథర్ నైట్ (6) నిరాశపరిచారు. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ 33 పరుగుల వ్యవధిలోనే చివరి 5 వికెట్లు కోల్పోయింది.
క్రాంతికి తోడు సయాలీ సత్ఘారే, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బకొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. శనివారం ఆట చివరకు 154/1 స్కోరు చేసింది. తన ఫామ్ కొనసాగించిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (69 బ్యాటింగ్ ) వరుసగా రెండో అర్ధ శతకంతో సత్తా చాటింది. అద్భుతమైన షాట్లతో ఇంగ్లండ్ బౌలర్లపై పైచేయి సాధించిన మంధాన తొలి వికెట్‌కు షెపాలీ వర్మ (33)తో 88 పరుగులు, రెండో వికెట్‌కు యస్తికా భాటియా (39 బ్యాటింగ్)తో అజేయంగా 66 రన్స్ జోడించి జట్టును బలమైన స్థితిలో నిలిపింది. ప్రస్తుతం భారత్ మొత్తంగా 269 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

