కొలంబో: తొమ్మిదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత టెస్టు జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. వచ్చే నెల 15 నుంచి 27 వరకు లంకతో రెండు టెస్టులు ఆడేందుకు గాను భారత్ తమ దేశానికి రానుందని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆగస్టు 15 నుంచి గాలె వేదికగా తొలి టెస్టు మొదలవనుండగా 23-27 మధ్య జరిగే రెండో టెస్టుకు కొలంబో ఆతిథ్యమివ్వనుంది