లక్నో: ప్రతిష్ఠాత్మక డేవిస్ కప్ పోరుకు భారత టెన్నిస్ జట్టు సిద్ధమైంది. లక్నో వేదికగా ఈ నెల 16, 17 తేదీల్లో భారత్, మొరాకో మధ్య డేవిస్ కప్ పోరు జరుగనుంది. ఇందుకు సంబంధించిన డ్రాను మంగళవారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారికంగా విడుదల చేశారు.
టోర్నీలో వెటరన్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న, యుకీ భాంబ్రీ, సుమిత్ నాగల్, శశి ముకుంద్, దిగ్విజయ్ ప్రతాప్సింగ్ బరిలోకి దిగుతున్నట్లు నాన్ప్లేయింగ్ కెప్టెన్ రోహిత్రాజ్పాల్ పేర్కొన్నాడు.