గువాహటి: సొంత గడ్డపై మరోసారి ప్రపంచ కప్ గెలవాలనే కసితో ఉన్న భారత జట్టు వామప్ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. రోహిత్ సేన శనివారం గవాహటిలోని బర్సపర క్రికెట్ స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇప్పటికే గువాహటి చేరుకున్న భారత క్రికెటర్లు నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియాను 2-1తో చిత్తు చేసిన టీమ్ఇండియా వరల్డ్ నంబర్ 1గా ఇంగ్లండ్‌ను ఢీ కొట్టనుంది. మరోవైపు ఐర్లాండ్‌ను ఉతికారేసిన ఇంగ్లండ బ్యాటర్లు ఉపఖండ పిచ్‌లపై సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు.
వరల్డ్ కప్ కోసం జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు శుక్రవారం ఉదయం భారత్‌కు చేరుకుంది. అయితే.. సుదీర్ఘ ప్రయాణంతో అలసిపోయామని ఇంగ్లండ్ క్రికెటర్లు తెలిపారు. వికెట్ కీపర్ జానీ బెయిర్సో అయితే.. 38 గంటల కంటే ఎక్కువ సయమం విమానంలోనే గడిచిపోయిందని వాపోయాడు.