హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఎఫ్ఐపీ ఇండియన్ ఓపెన్ పాడెల్ టోర్నీలో భారత ప్లేయర్ల హవా కొనసాగుతున్నది. శనివారం జరిగిన వేర్వేరు పోటీల్లో భారత ప్లేయర్లు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో కుమార్, హైదర్ ద్వయం 7-5, 6-2తో గౌడ, కుమార్ జంటపై గెలిచింది. మరో పోరులో భారత్-స్పానిష్ జోడీ శాంటిస్, ప్రఖ్యాత్ 6-2, 6-1తో ఎస్ శర్మ, సమా ద్వయంపై సునాయాసంగా గెలిచింది. మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లోనూ భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.