పారిస్ : ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జోడీ చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో చిరాగ్-సాత్విక్ వరుస గేమ్‌లలో 21-13, 21-19 స్కోరుతో లు చింగ్ యావొ-యాంగ్ పొ హాన్ జోడిని ఓడించింది. కాగా డెన్మార్క్ చెందిన విక్టర్ అక్సెల్సన్, చైనాకు చెందిన హి బింగ్ జియావొ పురుషుల, మహిళల టైటిల్స్‌ను దక్కించుకున్నారు. పురుషుల ఫైనల్లో అక్సెల్సన్ స్వదేశానికి చెందిన రాస్మస్ గమ్కెను 21-14, 21-15తో 43 నిమిషాలలో ఓడించగా, మహిళల ఫైనల్లో హి బింగ్ జియావొ 16-21, 21-9, 22-20తో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌పై నెగ్గి టైటిల్స్ గెలుచుకున్నారు.