ముంబై: మరికొద్దిరోజుల్లో మొదలుకానున్న టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఐసీసీ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరుగబోయే ఈ మెగా టోర్నీకి ముందు.. నాలుగు రోజుల పాటు క్వాలిఫై అయిన జట్లు వార్మప్ మ్యాచ్‌లు ఆడతాయి.
ఫిబ్రవరి 2 నుంచి 6 పాటు ఇవి కొనసాగుతాయి. ఇందులో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ టీమ్ఇండియా, గత ఎడిషన్ రన్నరప్ దక్షిణాఫ్రికా.. ఫిబ్రవరి 4న నవీ ముంబై వేదికగా మ్యాచ్ ఆడుతుంది. భారత ప్రధాన జట్టు కాకుండా ఇండియా ‘ఏ’.. 2వ తారీఖున యూఎస్ఏతో, 6న నమీబియాతో మ్యాచ్‌లు ఆడనుంది.