హైదరాబాద్, ఆట ప్రతినిధి: చెన్నై వేదికగా ఈనెల 18 నుంచి మొదలయ్యే బుచ్చిబాబు ఇన్విటేషన్ టోర్నీ కోసం బుధవారం హైదరాబాద్ జట్టును ఎంపిక చేశారు. జస్టిస్ పీ నవీన్‌రావు అధ్యక్షతన జరిగిన భేటీలో సంయుక్త కార్యదర్శి బసవరాజు పాల్గొని 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. హైదరాబాద్ టీమ్‌కు రాహుల్‌సింగ్ కెప్టెన్‌గా, హిమతేజ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
జట్టులో తన్మయ్ అగర్వాల్, త్యాగరాజన్, రోహిత్రాయుడు, అభిరాత్రెడ్డి, నితీశ్‌రెడ్డి, వరుణ్‌గౌడ్, అవినాశ్రావు, రాహుల్రాదేశ్, అనికేత్‌రెడ్డి, రవితేజ, నిశాంత్, శ్రీవాస్త, పృథ్వీరెడ్డి చోటు దక్కించుకున్నారు. అమన్‌రావు, నితేశ్‌రెడ్డి, ప్రజ్ఞయ్‌రెడ్డి, నితిన్‌సాయి యాదవ్, కార్తీకేయ, అర్ఫాజ్ అహ్మద్ స్టాంబ్బైగా ఎంపికయ్యారు.